విష్ణుప్రియని వాడుకుంటున్నావ్.. సింపథీ కార్డ్ యూజ్ చేస్తున్నావా
on Nov 29, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో మోస్ట్ వరెస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే ఠక్కున విష్ణుప్రియ అని చెప్తారు. మరి విష్ణుప్రియ ఇన్ని రోజులు ఎందుకు సేవ్ అవుతుందంటే.. అది బిగ్ బాస్ మామకే తెలుసు. ఓట్లు వేసే ఆడియన్స్ ని పిచ్చోళ్ళని చేస్తూ విష్ణుప్రియ-పృథ్వీలని సేవ్ చేస్తూ వస్తున్నారు. ఇక వీరి ఇష్యూ గురించి నిన్నటి ఎపిసోడ్ లో పునర్నవి మరోసారి అడిగింది.
విష్ణూతో నీ రిలేషన్ గురించి చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది పృథ్వీ.. ఇప్పటివరకూ నేను బయట నుంచి ఏం చూశానో అదే అడుగుతున్నానని పునర్నవి అడుగగా.. నీకు విష్ణు ప్రియ అంటే ఇష్టమా అని సూటిగా అడిగేసింది పునర్నవి. ఫ్రెండ్‌గా ఇష్టమని పృథ్వీ చెప్పాడు. అనంతరం.. పునర్నవి విష్ణు వైపు చూస్తూ.. నీకు పృథ్వీ అంటే ఇష్టమా అని అడిగింది. అవును ఇష్టమని అంది. ఇష్టం అంటే ఏ ఇష్టం.. ఫ్రెండ్‌గానా? అని మళ్లీ పునర్నవి అడుగగా.. ఫ్రెండ్ కంటే ఎక్కువ ఇష్టమని విష్ణుప్రియ చెప్పింది. మీ ఫ్రెండ్ షిప్ వల్ల మీ గేమ్ నాశనం అవుతుందని అనుకుంటున్నారా అని పునర్నవి అడుగగా.. స్పాయిల్ ఎందుకు అవుతుంది.. ఒకరికొకరం సపోర్ట్‌గా ఉంటున్నామని పృథ్వీ అన్నాడు. నాకైతే సపోర్ట్‌గా కాదు.. విష్ణు ప్రియను సింపథీ కార్డ్‌గా వాడుకుంటున్నావని అనిపిస్తుందని అనేసింది. నో.. నో.. నేను సింపథీ కార్డ్‌గా వాడుకోవడమేంటి? నాకు ఆ అవసరం లేదని అన్నాడు. హో.. నీకు అవసరం లేదా అని పునర్నవి నవ్వితే.. అవును అవసరం లేదు.. సింపథీ కార్డ్.. నాట్ విష్ణు అని పృథ్వీ అన్నాడు.
సరే ఈ ఫ్రెండ్ షిప్‌ని బిగ్ బాస్ గేటు దాటిన తరువాత కంటిన్యూ చేస్తావా అని అడుగగా.. నేను ఫస్ట్ టైమ్ హౌస్‌లోకి వచ్చినప్పుడు విష్ణుకి ఇదే చెప్పాను. నువ్వంటే నాకు ఇంట్రస్ట్ ఉందని విష్ణు అన్నప్పుడు.. ఇక్కడ 16 మందే ఉన్నాం.. వేరే ప్రపంచం తెలియదు కాబట్టి.. బయటకు వెళ్లిన తరువాత అభిప్రాయం మారొచ్చని క్లారిటీ ఇచ్చాను. బయటకు వెళ్లిన తరువాత ఇది కంటిన్యూ అవుతుందా లేదా అన్నది నాకు తెలియదు. నాకు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేవని క్లారిటీ ఇచ్చాడు పృథ్వీ. సింపథీ కార్డ్ అని ఎందుకు అనిపించిందని పృథ్వీ అడిగితే.. ఎప్పుడూ విష్ణూనే తన రిలేషన్ షిప్ గురించి చెప్తుంది.. కానీ నువ్వు ఎలాంటి స్టాండ్ తీసుకోవు. అసలు మీ రిలేషన్ షిప్ ఏంటనేది కన్ఫ్యూజన్ ఉంది.. విష్ణు ప్రియ ఓవర్ ఎక్స్‌ప్లినేషన్ వల్ల తను బ్యాడ్ అవుతుంది.. నువ్వు ఫ్రెండ్ షిప్ అని అంటున్నావ్ సింపుల్‌గా. కానీ విష్ణు మాత్రం ఫ్రెండ్‌గా చూడటం లేదు. దాని వల్ల తనకి జరగాల్సిన నష్టం జరుగుతుందని పునర్నవి అంది.
నేను కూడా పృథ్వీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయడం లేదు. ఇక్కడేం జరుగుతుందో మనకి తెలియదు. బయటకు వెళ్లిన తరువాత చూస్తామని అంది. సరే.. మీ ఫ్రెండ్ షిప్ మిమ్మల్ని టాప్ 2, టాప్ 3 వరకు తీసుకుని వెళ్తుందని అనుకుంటున్నావా అని పునర్నవి అడుగగా.. వెళ్లొచ్చు.. వెళ్లకపోవచ్చు.. బయట ఏం జరుగుతుందో మాకు తెలియదు. ఇక్కడ మాత్రం మేమ్ హానెస్ట్‌గా ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటున్నాం. మాకు అనిపించింది చేస్తాం. ఏది ఎలా కన్వే అవుతుందో తెలియదు. అనుభవించే వాళ్లకే తెలుస్తుందని విష్ణుప్రియ అంది. నేను అడిగింది సింపుల్.. ఓవర్‌గా వివరణ ఇస్తున్నావ్.. టాప్‌లో మీరు ఉంటారా? ఉండరా? అని అడుగుతున్నా అని పునర్నవి అడుగగా.. అదే చెప్తున్నా.. వెళ్లొచ్చు.. వెళ్లకపోవచ్చని విష్ణుప్రియ అంది. మొత్తానికి విష్ణుప్రియ, పృథ్వీల భాగోతం మరోసారి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
Also Read